Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ నాయకులు పొనుగోటి రవీందర్రావు
హైదరాబాద్: ప్రజాసమస్యలు పరిష్కరించడంలో నవతెలంగాణ పత్రిక ముందు ఉంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు పొనుగోటి రవీందర్ రావు అన్నారు. ముఖ్య అతిథిగా హాజరై ఈ మేరకు బుధవారం నవ తెలంగాణ తెలుగు దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిర్భయంగా.. ఉన్నది ఉన్నట్టుగా రాసే ఏకైక దినపత్రిక నవ తెలంగాణ అని అన్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు విజరు కుమార్ యాదవ్, అర్జున్, తిరుపతయ్య, నవతెలంగాణ సిబ్బంది కడారి పురుషోత్తం యాదవ్, రవీందర్ యాదవ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.