Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణలో జి.గంగాధర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలనీ, ఆ దిశగా కార్మిక సంఘాలు వారిని చైతన్యపర్చాలని తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కార్యదర్శి జి.గంగాధర్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని కార్మిక సంక్షేమ భవన్(అంజయ్య భవన్) వద్ద తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ అనుబంధం) 2022 క్యాలెండర్‌ను జి.గంగాధర్, సంగారెడ్డి డీసీఎల్ రవీందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. కార్మికులకు సంబంధించిన డైరీ, క్యాలెండర్లో వెల్ఫేర్ బోర్డులో కార్మికులు చేరేందుకు అవసరమైన, నష్టపరిహారాలకు సంబంధించిన సమాచారం అందించడం బాగుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన జీఓలు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు, ఈశ్రమ్ పోర్టల్ వివరాలు కార్మికులకు అందుబాటులో ఉంచినందుకు అభినందించారు. ఈశ్రమ్ కార్డులు కార్మికులందరికీ అందించడానికి వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలు కార్మికులకు తెలియజేయడానికి ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కోటంరాజు, రాష్ట్ర అధ్యక్షులు వంగూరు రాములు మాట్లాడుతూ..క్యాలెండర్‌కు సహకరించి ఆర్థిక సహాయం అందించిన సంఘమిత్రులకు, శ్రేయోభిలాషులకు అభినందనలు తెలిపారు. ఫెడరేషన్ కోశాధికారి ఎస్. రామ్మోహన్, ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, గాలయ్య, జంగయ్య, కార్యదర్శి ముదాం శ్రీనివాస్, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, తిరుమలయ్య, మల్లిఖార్జున్, రమణ, పగడాల లక్ష్మయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.