Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 3,03,56,894 మంది ఓటర్లున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో పురుషులు 1,52,56,474 మంది ఉండగా, మహిళలు 1,50,98,685 మంది మహిళలున్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా 43,67,020 మంది ఉండగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,11,160 మంది ఉన్నారు. మహిళల కన్నా పురుష ఓటర్ల సంఖ్య 1,57,789 అధికంగా ఉంది. రాష్ట్రంలో 34,867 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. థర్డ్ జెండర్ ఓటర్లు 1,735 మంది ఉన్నారు. కొత్తగా 1,36,496 మంది ఓటు నమోదు చేసుకున్నారు.