Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య సూచీలో ప్రగతిని సాధించిన
తెలంగాణకు అభినందనలు : ఉప రాష్ట్రపతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యరంగంలో భారత్-అమెరికా సమన్వయంతో పని చేస్తే ప్రపంచానికి మేలు జరుగుతుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) 15వ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి వర్చువల్ పద్దతిలో ఆయన ప్రసంగించారు. అమెరికా ఆధారిత సంస్థలు, భారతదేశ సంస్థలు పరస్పర సమన్వయంతో ఇటీవల కొర్బేవాక్స్, కోవోవాక్స్ టీకాలను రూపొందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నిటిఅయోగ్ ఆరోగ్యసూచీలో ప్రగతిని సాధించి టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తరించేందుకు టెలిమెడిసిన్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో నమోదు చేసుకోవడం ద్వారా వ్యాధిగ్రస్తుల సంపూర్ణ వివరాలు ఒకేచోట అందుబాటులోకి వస్తాయనీ, అప్పుడు సరైన వైద్యం అందించేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
నివారణపై దృష్టి సారించాలి... డాక్టర్ అనుపమ
భారతదేశంలో జబ్బులు రాకుండా ఉండేందుకునివారణపై అవగాహన పెరగాల్సిన అవసరముందని ఏఏపీఐ నాయకురాలు డాక్టర్ అనుపమ తెలిపారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో 75 గ్రామాలను దత్తత తీసుకుని వైద్యపరీక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో డయాబెటిక్ తదితర వ్యాధులు పెరిగిపోతున్నాయన్న విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు.