Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ నాయకులకు మాణిక్కం హెచ్చరిక
- 10న శిక్షణా తరగతులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్టీ నాయకులూ, కార్యకర్తలు హద్దులు మీరి మాట్లాడొద్దంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ హెచ్చరించారు. నాయకులంతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పని చేయాలని కోరారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తప్పకుండా అమలు చేయాలని సూచించారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) బుధవారం గాంధీభవన్లో సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలపాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ జనవరి 10న ఏఐసీసీ నిర్వహించే శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో జనజాగరణ పాదయాత్రలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాలలో పాదయాత్రలు తప్పకుండా జరపాలని సూచించారు. డిజిటల్ మెంబర్షీప్ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు.. రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై పోరాటం ఉధతంగా చేయాలని కోరారు. ధరల పెరుగుదల, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక ఉద్యమాలు, దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా, నిరుద్యోగ జంగ్ సైరన్, వరి దీక్షలు, కల్లోలలో కాంగ్రెస్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశామన్నారు.