Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యరంగంలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలి
- రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించి సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
వైద్య విధాన పరిషత్ విభాగంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లా యిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేశారు. ఆదిలాబాద్‌లో జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ ఆధ్వర్యంలో రిమ్స్ కార్మికులు నిరసన చేపట్టారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి నవీన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అక్రంఖాన్, సహాయ కార్యదర్శి బొజ్జ ఆశన్న, రిమ్స్ నాయకులు రోజ, పెర్క దేవిదాస్, సుమన్ తాయి తదిత రులు పాల్గొన్నారు. మంచిర్యాలలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్ అరవింద్‌కు వినతిపత్రం అందజేశారు.
కరీంనగర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు కార్మికులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించా లని సమ్మె చేపట్టారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, కార్మికులు పాల్గొన్నారు. జమ్మికుంట ప్రభుత్వాస్పత్రి ఎదుట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కార్మికులు విధులు బహిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఆవరణలో కార్మికులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్, ల్యాబ్ వివిధ విభాగాల కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు అరుణ్ సాగర్ మాట్లాడారు. కార్మికుల వేతనాలు పెంచటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడా లని కోరారు. కార్మికులకు ఏడు సంవత్సరాల నుంచి వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు మాత్రం కాంట్రాక్ట్ వ్యవధిని నాలుగు సంవత్సరాలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడు దల చేయడాన్ని ఖండించారు. హైదరాబాద్‌లోని చెస్ట్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఒకరోజు సమ్మెచేపట్టారు. ఉద్యోగులకు జీవో 68 ప్రకా రం వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ నగర అధ్యక్షులు కె.ఈశ్వర్రావు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నగర అధ్యక్షులు జె.కుమార్‌స్వామి డిమాండ్ చేశారు.