Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లోని ఎస్వీకే వేదిక
- రాజకీయ ముసాయిదా తీర్మానంపై ప్రధాన చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు హైదరా బాద్‌లో జరగనున్నాయి. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఈ సమావేశాలకు వేదిక కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న 96 మంది కేంద్ర కమిటీ సభ్యులు సమావేశాల్లో పాల్గొంటారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్కరత్, ఎస్ రామచంద్రన్ పిళ్లై, బిమన్‌బసు, బృందాకరత్, బివి రాఘవులు, సుభాషిణి అలీ హాజరుకానున్నారు. ఏప్రిల్‌లో కేరళలో జరిగే ఆ పార్టీ అఖిల భారత మహాసభలకు సమర్పించే రాజకీయ ముసాయిదా తీర్మానంపై కేంద్రకమిటీ సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరగనుంది. కేంద్ర కమిటీ దాన్ని ఆమోదిస్తుంది. కిందిస్థాయి శాఖల వరకు ఈ రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని తీసుకెళ్తారు. అంతర్జాతీయ, జాతీయ తాజా రాజకీయ పరిణామాలు, సరళీకృత ఆర్థిక విధానాల అమలు, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ), త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, మూడు వ్యవసాయ చట్టాలను మోడీ సర్కారు వెనక్కి తీసుకోవడం, రైతాంగ పోరాట విజయం తదితర అంశాలపైనా ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది.