Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజా సమస్యలను నిర్దిష్ట సమయంలోపు పరిష్కరించాలని రాష్ట్ర గవర్నర్, డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్‌భవన్ అధికారులను ఆదేశించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇటీవల రాజ్‌భవన్‌లో ఫిర్యాదులు, సలహాల పెట్టెలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఆమె ఆయా బాక్సుల్లో వచ్చిన పిటిషన్లు, పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ప్రజలు తమ ఆలోచనలు, సలహాలు, ఫిర్యాదులు పేర్కొంటూ విన్నవించే ప్రతి దరఖాస్తులనూ సానుభూతితో పరిశీలించాలనీ, ఇది రాష్ట్ర ప్రజలకు సేవే చేసేందుకు అద్భుత అవకాశంగా భావించాలని కోరారు. పిటిషన్లు త్వరగా పరిష్కరించేందుకు సమస్యలను క్రమమైన పద్ధతిలో విభజించుకోవాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు 181 పిటిషన్లు రాగా అందులో ఎక్కువగా భూసమస్యలు, సర్వీస్‌కు సంబంధించినవి, ఉద్యోగాల నోటిఫికేషన్లు, ఆర్థిక సహాయం కోరేవే ఎక్కువగా ఉన్నాయి. ఈ సమావేశంలో గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.