Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్రి డాక్టర్స్ డైరీ ఆవిష్కరణలో బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులు పంట మార్పిడిపైపు మళ్లేలా వారిని చైతన్యవంతులను చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ వ్యవసాయ అధికారులను కోరారు.ఈమేరకు వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అందుకనుగుణంగా అధికా రులు అంకితభావంతో పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. గురువారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో రాష్ట్ర అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ 2022 డైరీ, క్యాలెండర్‌ను వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ హన్మంతు, ఆగ్రోస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాములు, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజరత్నం, ప్రధాన కార్యదర్శి తిరుపతి, నాయకులు మధుమోహన్, నర్సింహారెడ్డి, కష్ణవేణితో కలిసి బోయినపల్లి ఆవిష్కరించారు.