Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్సుల అవార్డులకు నామినేషన్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డుల కోసం 2022 ఏడాదికి గానూ ఫిబ్రవరి 28వ తేదీలోపు నామినేషన్లను సమర్పించాలని రాష్ట్రాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) సంయుక్త కార్యదర్శి కె.ఎస్.భారతి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. నర్సింగ్ వృత్తిలో విశిష్ట సేవలందించినందుకు ప్రతి ఏడాది ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి మే 12న ఈ పురస్కారాలను ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. నామినేషన్లను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ అధ్యక్షతన గల కమిటీ పరిశీలిస్తుంది. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత, ప్రయివేటు, మిషనరీ, స్వచ్చంద సంస్థల ద్వారా విశిష్ట సేవలందించే నర్సులు ఈ అవార్డు పొందేందుకు అర్హులు. రూ.50,000 నగదు పారితోషికంతో పాటు ఒక సర్టిఫికెటు, మెడల్‌ను బహుకరిస్తారు. జాతీయ స్థాయిలో నామినేషన్లు పంపడానికి ముందు రాష్ట్ర స్థాయిలో కమిటీ ఎంపిక చేయాలి. మూడు కేటగిరీల్లో ఐదుగురు చొప్పున కనీసం 15 నామినేషన్లు పంపాలి.