Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తాజా మార్గదర్శకాలు, సూచనలు, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకుని జనవరి 10 నుంచి ప్రత్యక్ష విచారణను నిలిపేస్తున్నట్టు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తెలిపింది. ఈ మేరకు కమిషన్ ప్రజా సంబంధాల అధికారి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇవి అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. అన్ని ఫిర్యాదులు, నివేదికలు, ప్రత్యుత్తరాలు, కామెంట్లు వ్యక్తిగతంగా, ఏదైనా పోస్టల్ పద్దతిలో లేదా అధికారిక ఈ-మెయిల్ ఐడీ శీటళషవ-రష్ట్రతీషఏ్వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ ద్వారా స్వీకరించబడుతాయని వివరించారు. మరింత స్పష్టత కోసం 040-24601572 నెంబర్కు కాల్ చేయవచ్చని తెలిపారు.