Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజీనామా చేయను...పార్టీలోనే ఉంటా : జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాననీ, పార్టీకి రాజీనామా చేయబోనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. తన బాధను సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు చెబుతానన్నారు. జనవరి 20 తర్వాత ఢిల్లీకి వెళ్లి వారిని కలుసానని తెలిపారు. ఆ తర్వాతనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వివరించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పార్టీ అంతర్గత విషయాలను తాను బహిర్గతం చేయబోనని వెల్లడించారు. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందిని రాజకీయ వ్యవహారాల కమిటీలో చెప్పినట్టు తెలిపారు.