Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నడ్డాకు గజ్జల కాంతం ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జల కాంతం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను ప్రశ్నించారు. దేశ ప్రజలను మోసం చేసేలా నడ్డా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడటం సరైందికాదన్నారు. గురువారం హైదరాబాద్లోని ఒక హౌటల్లో ఆ కమిటీ వైస్ చైర్మెన్ కొమ్ము తిరుపతితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లా డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజరు ఉద్యోగులకు న్యాయం చేస్తానంటున్నారనీ, అసలు మీరేం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగాన్ని రూపుమాపడంలో విఫలమైన బీజేపీ...రిజర్వేషన్లు అమలులోనూ నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అమలు కావడం లేదనీ, ఉత్తరప్రదేశ్లో హక్కుల కోసం పోరాడిన వారిని జైల్లో పెట్టారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం? తెలంగాణకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు.