Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములు ప్రభుత్వానివేనని గురువారం హైకోర్టు తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. భూములపై హెచ్‌సీయూకి చట్టబద్ధత, హక్కులకు ఆధారాల్లేవని తేల్చింది. భూములు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాటిపై హక్కులను బదిలీ చేయలే దని చెప్పింది. హక్కులు లేనందున వాటిలో జీహెచ్ఎంసీ రోడ్డు నిర్మించే అధి కారం ప్రభుత్వానికి ఉంటుందని తీర్పులో పేర్కొంది.. అయితే సదరు భూములపై హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చునని హెచ్‌సీయూకి సూచించింది. తమ భూమిలో జీహెచ్ఎంసీ రోడ్డు నిర్మించటాన్ని సవాల్ చేస్తూ హెచ్‌సీయూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. హెచ్‌సీయూకి 1975లో 2,324 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, భూకేటాయింపుపై యాజమాన్య హక్కుల ఉత్తర్వులు ఇచ్చినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తీర్పులో పేర్కొంది. హెచ్‌సీయూ భూమిని గతంలో వేరే వాళ్లకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు తన దానికి బదులు భూమి ఇస్తే చాలని హెచ్‌సీయూ ఎంఓయూ చేసుకుందనీ, తిరిగి భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పడు జరిగిన కేసులో వర్శిటీ పాత్ర ఏమీ లేదని గుర్తు చేసింది. భూమిని తీసుకున్న హెచ్‌సీయూ దానిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు హక్కులు పొందని కారణంగా ఆ భూమిపై సర్వహక్కులు ప్రభుత్వా నికే చెందుతాయని తెలిపింది. 2,324 ఎకరాల భూమిలో గతంలో ప్రభుత్వం తీసుకున్న 500 ఎకరాలు పోను మిగిలిన భూమిపై తమకు హక్కు ఇవ్వాలని 2013లో హెచ్‌సీయూ రాష్ట్రానికి లేఖ రాయడాన్ని బట్టి దానిపై హక్కు లేదనే విషయం హెచ్‌సీయూకి తెలుసునని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న భూమిలో జీహెచ్ఎంసీ రోడ్డు వేసిందని కూడా చెప్పింది. భూమిపై హక్కుల కోసం హెచ్‌సీయూ సంబంధిత సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసుకోవచ్చునని తెలిపింది. సంబధిత రిట్‌ను కొట్టేస్తూ తీర్పు చెబుతున్నట్టు వెల్లడించింది.
రామప్ప అభివృద్ధికి చర్యలు షురూ
రామప్ప ఆలయ అభివృద్ధి కోసం ఈ నెల 10న అదే ఆలయ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వాధికారులతో సమావేశమవుతామని కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ తరఫున కేంద్రం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే ఒకసారి రాష్ట్ర పురావస్తు శాఖ ఇతర అధికారులతో కేంద్రం సమావేశం అయ్యిందని విచారించింది. యునెస్కో గుర్తింపు నేపథ్యంలో రామప్ప ఆలయం వద్ద చేపట్టాల్సిన పనులపై హైకోర్టు విచారిస్తున్నది. గురువారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ సారధ్యంలోని అనంతరం కోర్టు డివిజన్ బెంచ్ ఈ అంశాన్ని విచారించింది. లైటింగ్ఏర్పాట్లు జరిగాయనీ, కామేశ్వరాలయం పనుల షురూ చేస్తామని, ఆ ఏరియా డెవలప్ చేసేందుకు రాష్ట్రం కూడా చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వం చెప్పింది. విచారణ ఆరు నెలలకు వాయిదా వేసింది.
వేధింపులపై రిపోర్టు ఇవ్వండి: జిల్లా జడ్జికి హైకోర్టు ఆదేశం
వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీసులు ఒక హత్య కేసు విచారణ చేస్తామని చెప్పి పది రోజులుగా కొట్టి వేధించారంటూ ఒక కుటుంబం నమోదు చేసిన అభియోగాలపై హైకోర్టు స్పందించింది. ఈ కేసును విచారించి రిపోర్టు ఇవ్వాలని ఆ జిల్లా జడ్జిని చీఫ్ జస్టిస్ బెంచ్ గురువారం ఆదేశించింది. తన అల్లుడు సతీష్ హత్య కేసు దర్యాప్తు పేరుతో పోలీసులు తన భర్తను కొట్టారని కమలమ్మ అనే మహిళ పలువురికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఒక పత్రికలో వచ్చిన వార్తను హైకోర్టు రిట్‌గా చేపట్టి విచారించింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.