Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దొంగతనాలు, దోపిడీలు చేయాలని యత్నించిన ఓ నేరస్తుడిని రాచకొండ పోలీస్కమిషనరేట్ ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్కు చెందిన మహ్మద్ హుస్సేన్ (22) దినసరి కూలీగా పనిచేస్తూ ఇటీవల రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లికి మకాం మార్చాడు. వస్తున్న ఆదాయం చాలకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఉత్తరప్రదేశ్ నుంచి పిస్తోలు, ఆరు బుల్లెట్లు అక్రమంగా తెచ్చి దగ్గర పెట్టుకున్నాడు. వాటితో దొంగతనాలు, దోపిడీలు చేయాలని వ్యూహం పన్నినట్టు పోలీసులు తెలిపారు. మైలార్దేవ్పల్లి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న హుస్సేన్ను పోలీసులు తనిఖీ చేయడంతో పిస్తోలు, బుల్లెట్లు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు.