Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటిఫికేషన్‌ను విడుదల చేసిన ప్రోవీసీ శివప్రసాద్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నం, బెంగళూరు ప్రాంగణాల్లో వచ్చే విద్యాసంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు గీతం ప్రోవీసీ ఎన్ శివప్రసాద్ గురువారం హైదరాబాద్‌లో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్, పబ్లిక్ పాలసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజారోగ్యం, ఐటీ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో నాలుగేండ్ల బీ ఆప్తోమెట్రీ, టీసీఎస్ సౌజన్యంతో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగెటివ్ సిస్టమ్స్, బీటెక్‌లో సీఎస్ అండ్ బీఎస్ కోర్సులతోపాటు మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీని ప్రారంభించామని గుర్తు చేశారు. బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-మెషిన్ లెర్నింగ్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్, వీఎల్ఎస్ఐ, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికిల్స్ వంటి ప్రత్యేక కోర్సులున్నాయని వివరించారు. గీతం ప్రవేశ పరీక్ష దరఖాస్తులను షషష.స్త్రa్.స్త్రఱ్aఎ.వసబ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయొచ్చని సూచించారు. ప్రతిభావంతులకు ఆకర్షణీయమైన స్కాలర్షిప్లు అందజేస్తామన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో స్లాట్ బుక్‌చేసుకుని ఇంటివద్ద నుంచే ప్రవేశ పరీక్షలను రాయొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గీతం అడ్మిషన్స్ డైరెక్టర్ సి ఉదరుకుమార్, డిప్యూటీ డైరెక్టర్ కె శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.