Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచి కోసం ఉపయోగించుకోవాలి:ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి
నవతెలంగాణ - వనపర్తి
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించుకోవాలి కానీ, యువత దారి తప్పుతోందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ సురేష్ కుమార్ అధ్యక్షతన గురువారం 'పెరుగుతున్న సాంకేతికత-తరుగుతున్న విలువలు' అంశంపై నిర్వహించిన సెమినార్లో అరుణ జ్యోతి మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో అంతరిస్తున్న మానవ విలువలను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. సెల్‌ఫోన్ కారణంగా నేటి యువత ఫోర్న్ వీడియోలు, మద్యం, డ్రగ్స్‌కు బానీసలై బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. సెల్‌ఫోన్ ద్వారా ప్రపంచాన్ని చదివే అవకాశం ఉందని, దీన్ని ఉపయోగించుకుని మేధస్సు పెంచుకుని, అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. అమ్మా యిలు వ్యక్తిగత రక్షణ కోసం పుస్తకాల బ్యాగుల్లో చిన్న డబ్బాలో కారం పొడి తెచ్చుకోవాలని, ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచిం చారు. నిలదీసే తత్త్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రత్యేకించి షాపింగ్ మాళ్లకు వెళ్లినప్పుడు సీసీ కెమెరాలను గమనించి మసలుకోవాలని, లేకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర నాయకులు శశికళ, జిల్లా కార్యదర్శి లక్ష్మి, కమిటీ సభ్యులు కవిత, లక్ష్మి, కళాశాల అధ్యాపకులు కష్ణ మూర్తి, దౌలమ్మ, రాజేశ్వరి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పి.శ్రీనివాస్, పుష్ప పాల్గొన్నారు.