Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్ర విచారణ జరిపించాలి
- అతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే...
- వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
- కాంగ్రెస్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ అండదండలతోనే వనమా రాఘవేంద్రరావు ఆరాచకాలకు పాల్పడ్డారని టీపీసీసీ విమర్శించింది. అతడి వేధింపులు తట్టుకోలేక నిండు ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలనీ, రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈనేపథ్యంలో రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనీ, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించింది.గురువారం గాంధీభవన్‌లో ఎంపీ కోమటిరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, సంభాని చంద్రశేఖర్, బలరాంనాయక్, బక్కజడ్సన్, అన్వేష్‌రెడ్డి, శివాసేనారెడ్డి, వెంకట్ తదితరులు వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు.
ఇంత దారుణమా? : రేవంత్‌రెడ్డి
పాల్వంచలో భార్య, ఇద్దరు పిల్లలకు నిప్పు పెట్టి రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్న ఘటనను తనను కలిసివేసిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా? అని ప్రశ్నించారు. రామకష్ణ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వీడియోను విడుదల చేశారు. ఆయనకు అధికార పార్టీ టీఆర్ఎస్ వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. అతని కీచక చేష్టలకు ఓ కుటుంబం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి మూడు రోజులైనా చర్యలెందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాఘవ అరాచకాలు సీఎంకు తెలియకపోవడమేంటని ప్రశ్నిం చారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నదని నిలదీశారు. ప్రభుత్వ నిఘా అనేది ప్రతిపక్షాల ప్రజాపోరాటాలకెే పరిమితమైందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాఘవను అరెస్టు చేయాలి : కోమటిరెడ్డి
రామకృష్ణ కుటుంబం ఆత్మ హత్యకు కారణమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట ్రెడ్డి డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే కుమారుడు ఇంతటి దారుణానికి పాల్పడితే చర్యలు తీసుకోక పోవడం సిగ్గుచేటన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుని రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సామాన్యులకు రక్షణలేకుండాపోయింది : భట్టి
రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమ ర్శించారు. వ్యవస్థలన్నీ అధికార పార్టీ కోసమే పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితు లకు న్యాయం చేయాలంటూ గవ ర్నర్, డీజీపీ, మానవహక్కుల సంఘాన్ని కలుస్తామన్నారు. కొత్త గూడెంలో జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య జరిగి మూడు రోజులైనా నిందితుడిని ఎందుకు అరె స్టు చేయలేదనీ, పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్న దని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను పార్టీ అవసరా లకే వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయం లో సర్కార్ పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు చేపడతామని హెచ్చరించారు.
రాఘవపై నిర్భయ చట్టాన్ని నమోదు చేయాలి
- ఫ్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ నేతల ధర్నా
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడిపై నిర్భయ చట్టం, హత్యానేరం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. తమ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు నేరాలు చేసేందుకు వీలుగా సీఎం కేసీఆర్ లైసెన్స్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్‌నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ మాట్లాడుతూ రామకష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ2 నిందితుడు కాదనీ, ఆయనపై నిర్భయ చట్టం, హత్య నేరాలకింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలను పూసగుచ్చినట్టు రామకృష్ణ సుసైట్నోట్లో పేర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. రామకష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉజ్మాషాకీర్, సిరాజ్ ఖాన్, అర్షిద్తోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.