Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నాంపల్లిలో ప్రారంభించిన నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను రద్దు చేస్తున్నట్టు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్యమార్గం తెలిపారు. కాగా, జనవరి ఒకటో తేదీన ఎగ్జిబిషన్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు రోజులు నడిచాక బంద్ చేశారు. హైకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో ఎగ్జిబిషన్‌ను రద్దు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నుంచి సొసైటీకి నోటీసులు అందిన నేపథ్యంలో పాలకవర్గం అత్యవసర సమావేశమై అందుకు నిర్ణయం తీసుకున్నట్టు కార్యదర్శి చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. నుమాయిష్ రద్దయినందున దుకాణదారుల యజమానుల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తామన్నారు. ఇప్పటికే కొంతమంది యజమానులు తమ డబ్బులు ఇవ్వకపోయినా, వచ్చే ఏడాది నుమాయిష్‌లో తిరిగి దుకాణాలు పెట్టుకుంటామని కోరినట్టు తెలిపారు. వారి కోరిక మేరకు వచ్చే నుమాయిష్‌లో అవకాశం కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్స్ యజమానులు, సిబ్బందికి వారం రోజులపాటు మైదానంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వ్యాక్సినేషన్ సెంటర్‌తోపాటు లయన్స్ క్లబ్ సహకారంతో భోజన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.