Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశా వర్కర్ల విజయోత్సవ సభలో రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోరాటాల ద్వారానే ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ జీఓ నెం.1ని విడుదల చేసిందని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూక్ష్మి రాష్ట్ర అధ్యక్షులు పి.జయలకిë అన్నారు. రూ.7,500 పారితోషికం రూ.9,750కి పెరనున్నదని చెప్పారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నగర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విజయోత్సవ సభలో ఆమె మాట్లాడారు. ఆశావర్కర్లు కొంత కాలంగా రాష్ట్రవ్యాప్తంగా చేసిన పాదయాత్రలు, సమ్మెలు, సమరశీల పోరాటాలతోనే ప్రభుత్వం పారితోషికం పెంచుతోందన్నారు. పారితోషికాలు పెంచుతూ జీఓ విడుదల చేసిందనందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 2021 జూన్ నుంచి ఏరియర్స్ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విజయం స్ఫూర్తితో ఫిక్స్డ్ వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ.. ఢిల్లీ సరిహద్దులో రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు చేసిన పోరాటాల ఫలితంగా రైతులకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పడంతోపాటు చట్టాలను రద్దు చేశారని అన్నారు. రాష్ట్రంలోనూ ఆశావర్కర్లు చేసిన పోరాట ఫలితంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పారితోషికాలు పెంచిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెలో ఆశావర్కర్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సభలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షురాలు యాదమ్మ, నాయకులు కళావతి, మమత, గౌరి పాల్గొన్నారు.