Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉట్నూర్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో గురువారం మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ఎస్ఐ భరత్ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేబీనగర్ కాలనీకి చెందిన వాఘ్మారే పుష్ప ఉదయం సమీపంలో ఉన్న చేతిపంపు వద్దకు నీళ్లకు వెళ్లింది. ఈ క్రమంలో పాతకక్షలను మనసులో పెట్టుకున్న కొత్తపల్లి రమేష్ ఆమెపై యాసిడ్ పోశాడు. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు బాధిత మహిళను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఎంపీపీ పంద్ర జైవంత్రావు, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్ బాధితురాలిని పరామర్శించారు. బాధిత మహిళకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. మహిళ భర్త దీలిప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని ఆరెస్టు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.