Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోనరావుపేట
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన యమా నర్సయ్య(58) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఆయనకు ఆరుగురు కూతుర్లు ఉన్నారు. అందరికి పెళ్లిండ్లు అయినవి. వారి పెండ్లిలకు చేసిన అప్పుతోపాటు వ్యవసాయానికి చేసిన అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. భూమి అమ్మి అప్పులు తీర్చాలని నర్ణయించుకున్నాడు. ఈ తరుణంలో అనారోగ్యం పాలయ్యాడు. దాంతో అతని కూతురు గురువారం కరీంనగర్ ఆస్పత్రిలో చూపించేందుకు సిరిసిల్ల నుంచి బస్సులో వెళ్తున్నారు. మార్గమధ్యలో ఒద్యారం గ్రామం సమీపంలో బస్సులోనే గుండెపోటుతో మరణించాడు. మృతుడికి భార్య అమృత ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోనరావుపేట సర్పంచ్ పోకల రేఖసంతోష్, ఎంపీటీసీ దేవరకొండ చారి కోరారు.