Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 67,411 మందికి అందజేత
- ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన జూట్, చేనేత బ్యాగుల విడుదల
- అంగన్వాడీలు, ట్రాన్స్జెండర్లకు మంత్రులు కేటీఆర్, సత్యవతిరాథోడ్ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 67,411 మంది అంగన్వాడీ టీచర్లకు చేనేత చీరలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. గురువారం హైదరాబాద్లోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీలకు చీరలను మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ అందజేశారు. అనంతరం ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన చేనేత, జ్యూట్ బ్యాగులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..రాష్ట్రంలోని 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ కేంద్రాలలో పనిచేస్తున్న 67,411 మంది టీచర్లకు చేనేత చీరలు అందజేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి ఇప్పటికే రెండు జతల ప్రత్యేక చీరలు అందించామనీ, తాజాగా మూడో జతగా చేనేత చీరలు అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. అంగన్వాడీలకు గౌరవ ప్రదమైన వస్త్రాలు, సరైన వేతనాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేస్తున్నామన్నారు. వాటి ద్వారానే రాష్ట్రంలో ఫ్రీ ప్రైమరీ విద్యను, పోషకాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ద్విదేవరాజన్ మాట్లాడుతూ..మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో ప్రభుత్వం తమ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తామని హామీ ఇచ్చారు.