Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘట్కేసర్ హెచ్‌పీసీఎల్ డిపోవద్ద నిరసన
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్లోని హెచ్‌పీసీఎల్ డిపోవద్ద ఆయిల్ ట్యాంకర్ యజమానులు మెరుపు సమ్మెకు దిగారు. ప్రస్తుతం టాప్ లోడ్ ఫిల్లింగ్ సిస్టమ్ ఉన్న ట్యాంకర్లను, బాటమ్ లోడ్ ఫిల్లింగ్ సిస్టంలోకి మార్చుకోవాలని పెట్టిన రూల్‌తో తాము సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని, హెచ్‌పీసీఎల్ కొత్తరూల్ సరైంది కాదని నిరసన వ్యక్తం చేశారు. బాటమ్ లోడ్ ఫిల్లింగ్ సిస్టమ్ ద్వారా ఒక్కో ట్యాంకర్‌కు 10 నుంచి 15 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉన్నందున తాము ఇబ్బందులు పడుతామని ట్యాంకర్ల యజమానులు చెప్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆయిల్ కంపెనీలతో కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్నా ఫలితం లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ రవాణా నిలిపి వేస్తున్నామని ప్రకటించారు.