Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టటం లేదని వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శిం చారు. ఈ అంశంపై కేంద్రానికి కనీస సోయి ఉండాలి కదా? అని ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో శుక్రవారం ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడున్నరేండ్ల కేసీఆర్ పాలనలో ఎనిమిది వేల రైతులు మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. రైతులను కోటీశ్వరులను చేస్తానని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, వారిని కాటికి పంపుతున్నదని చెప్పారు. ధాన్యం రగడ, ధరణి గందరగోళంతో అనేక మంది రైతులు తమ నిండు ప్రాణాలను తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ మూడు లక్షలమందికి ఇచ్చి, 36లక్షల మందికి ఎగ్గొట్టారని తెలిపారు. రైతు బంధుకి జె ౖకొట్టి ఇన్పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మి, పంట బీమా తదితర పథకాలకు నై అంటున్నారని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకరినొకరు తిట్టుకుంటూ రైతుల సమస్యలను పక్కదారి పట్టించారని విమర్శించారు. పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారణమైన రాఘవేంద్రను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.