Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామారెడ్డి జిల్లాలో ఘటన
నవతెలంగాణ-భిక్కనూర్
భూ తగాదాలతో పురుగుల మందు తాగి యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువ రైతు రాజేందర్ (25) కుటుంబానికి గ్రామ సమీపంలో ఉన్న 10 గుంటల భూమి కొన్నేండ్ల నుంచి కబ్జాలో ఉంది. అయితే ఈ భూమిని కొందరు వ్యక్తులు రాజేందర్ కుటుంబానికి తెలియకుండా అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి విక్రయించారు. ఈ భూమి విషయంలో కొనుగోలుదారులకు రాజేందర్ కుటుంబానికి గొడవ చోటుచేసుకోవడంతో మనస్తాపం చెందిన రాజేందర్ బుధవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. తన కొడుకు మృతికి భూ తగాదాలే కారణమనీ, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నవీన్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.