Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సింగరేణిలో కోవిడ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ సంస్థ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, పర్సనల్ (ప్రా) డైరెక్టర్ ఎన్ బలరామ్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఏరియాల జీఎంలు, వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ మరో రూపంలో విజంభిస్తున్న నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న వైద్య విభాగం, ఏరియా జీఎంలు కరోనాను ఎదుర్కోనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు. శ్రీ ఎన్.బలరామ్ ఆదేశించారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులకు ఇప్పటికే దాదాపు వందశాతం వాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. ఇంకా మిగిలి ఉన్న కొద్దిపాటి మందికి వారి ఇండ్ల వద్దకే వెళ్లి టీకాలు వేయాలని కోరారు. 60 ఏండ్లు పైబడిన కార్మికులకు ఈ నెల 10 నుంచి రెండు రోజుల్లో బూస్టర్ డోస్ వేయాలని ఆదేశించారు. రాష్ట్ర వైద్యశాఖ ఆధ్వర్యంలో 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాక్సినేషన్‌ను ప్రారంభించారనీ, సింగరేణి ప్రాంతంలోనూ ఆ ప్రక్రియను పూర్త చేయాలని సూచించారు. ప్రస్తుతం 40 వేల రాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ రానున్న కాలంలో వీటి కొరత సింగరేణిలో ఏర్పడకుండా ఉండేందుకు మరో 50 వేల కిట్లు కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ కేసుల సంఖ్య, ఆస్పత్రుల వారీగా ఉన్న బెడ్లు, ఇంజెక్షన్లు, క్వారంటైన్ కిట్లు తదితర అంశాలను అడిగితెలుసుకున్నారు. కోఆర్డినేషన్ జీఎం కె.సూర్యనారాయణ, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కె.బాలకోటయ్య, స్ట్రాటజిక్ ప్లానింగ్ జీఎం కె.సురేందర్, రవి ప్రసాద్, ఎ ఆనందరావు, కె బసవయ్య, డాక్టర్ మంతా శ్రీనివాస్ పాల్గొన్నారు.