Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి
- జీహెచ్ఎంసీలోనే 1452 కేసులు
- పదిరోజుల వ్యవధిలోనే 12 రెట్లకుపైనే పెరుగుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 2,295 మందికి కరోనా సోకింది. మరో 10,336 మంది రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. గత నెల 27న నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 182 మాత్రమే. అంటే కేవలం పది రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య 12 రెట్లకుపైగా పెరిగి 2,295కు చేరింది. దీనిని బట్టే రాష్ట్రంలో ఎంత వేగంగా కరోనా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధితో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. గత నెల 27వ తేదీన గ్రేటర్లో పరిధిలో 90 కేసులు రాగా..తాజాగా శుక్రవారం నాడు 1,452 రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఒక్క హైదరాబాద్లో 16 రెట్లకుపైగా కేసులు పెరిగాయి. 27వ తేదీన 13 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే ఏడో తేదీన 0 కేసులు నమోదైన జిల్లాలు నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు మాత్రమే. శుక్రవారం ఒక్కరోజే కరోనాతో ముగ్గురు చనిపోయారు.