Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవను వెంటనే ఆరెస్టు చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఆయన్ను కాపాడుతుందనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నల్ల రిబ్బన్ కట్టుకుని మౌన దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ, వరలక్ష్మి, నగర అధ్యక్షురాలు కవిత తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వనమా రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు కట్ల శ్రీనివాస్, రాంశెట్టి నరేందర్, సంజరు యాదవ్, శ్రీధర్‌గౌడ్ తదితరులతో కూడిన బృందం రాష్ట్ర హౌంమంత్రి మహమూద్ అలీకి వినతిపత్రం సమర్పించారు.
'ది వైర్‌కు అభినందనలు :రేవంత్ ట్వీట్
టెక్‌ఫాగ్ ఆఫ్‌ను ఉపయోగించి వాట్సాఫ్, ట్వీట్టర్ ట్రెండ్లను మార్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాన్ని బయటబయలు చేయడంలో 'ది వైర్' చూపిన ధైర్యాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈమేరకు శుక్రవారం ఆ సంస్థను అభినందిస్తూ ట్వీట్ చేశారు. నిజాలను ఎవరూ ఎక్కువ కాలం దాచలేరని చెప్పారు. అనంతరం కీచక రాఘవ ఎక్కడున్నాడంటూ ప్రశ్నించారు. ప్రగతిభవన్‌లోనా? ఫామ్ హౌస్‌లోనా? ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 13 ఏండ్ల బాలికలతో సహా మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కేటీఆర్ మనసు చలించడం లేదని విమర్శించారు.
ఆర్ఎస్ఎస్కు అనుమతి ఎలా ఇచ్చారు : మాణిక్కం ఠాగూర్
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 300 మందితో ఆర్ఎస్ఎస్ శిక్షణా తరగతులకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం...కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 120 మందితో హైదరాబాద్ తలపెట్టిన శిక్షణా తరగతులకు అనుమతి ఇవ్వడం లేదని ట్వీట్ చేశారు. ఇదేమీ ద్వంద్వ నీతంటూ అని ప్రశ్నించారు.