Authorization
Sat April 12, 2025 02:05:03 pm
- అందరికీ న్యాయం చేయాలి : మధుసూదన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల కేటాయింపులకు నిరసనగా ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్, జీజేఎల్ఏ అధ్యక్షులు పి మధుసూదన్‌రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న విద్యాభవన్ వద్ద ఆయన దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను తుంగలో తొక్కి జీవోనెంబర్ 317కు వ్యతిరేకంగా అధ్యాపకులను మల్టీ జోన్-2 నుంచి 1కు, మల్టీ జోన్-1 నుంచి 2కు ఇష్టానుసారంగా కేటాయించారని విమర్శించారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ చూపించకుండా మారుమూల ప్రాంతాలకు కేటయించడం సరైంది కాదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను పాటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, అధ్యాపకుల కుటుంబాల క్షేమాన్ని విస్మరించి వారికి అననుకూల స్థానాలను కక్షపూరితంగా కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకుని అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్నా పోలీసులు అరెస్టు చేసి బేంగపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యా జేఏసీ సెక్రెటరీ జనరల్ కృష్ణకుమార్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రజిత, లక్ష్మి, విజయశేఖర్తోపాటు డిగ్రీ కాలేజీల అధ్యాపకుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంజీవయ్య, సురేందర్‌రెడ్డి, బాధిత అధ్యాపకులు పాల్గొన్నారు.