Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల సీనియార్టీ నిర్ణయం, జిల్లాల కేటాయింపులో జరిగిన పొరపాట్లు సవరించాలనీ, ప్రభుత్వానికి వారు చేసుకున్న అప్పీళ్లను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూ టీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. 13 జిల్లాలకు నిలుపుదల చేసిన భార్యాభర్తల (స్పౌజ్) అప్పీళ్లను పరిగణనలోకి తీసుకుని వెంటనే ఉత్తర్వులివ్వాలని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి కోరారు. జిల్లాల్లో సీనియార్టీ నిర్ణయంలో జరిగిన లోపాలు, తద్వారా జిల్లాల కేటాయింపులో నష్టపోయిన ఉపాధ్యాయులు దాదాపు ఎనిమిది వేలమంది విద్యాశాఖ కార్యదర్శికి అప్పీల్ చేసుకున్నారని వివరించారు. వాటిని ఇంతవరకు పరిష్కరించలేదని తెలిపారు. భార్యాభర్తలు ఉద్యోగులైన సందర్భంలో అప్పీల్ చేసుకుంటే ఒకే లోకల్ క్యాడర్‌కు తీసుకువస్తామంటూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం కేవలం 19 జిల్లాల స్పౌజ్ కేసులు మాత్రమే పరిష్కరించిందని పేర్కొన్నారు, మిగిలిన జిల్లాల స్పౌజ్ కేసులు ఎటూ తేల్చకుండానే జిల్లాల్లో పాఠశాలలను కేటాయించారని తెలిపారు. శుక్రవారం అందరినీ కొత్త పాఠశాలల్లో బలవంతంగా చేర్పించారని వివరించారు. అప్పీళ్లన్నింటినీ సత్వరమే కేటాయింపులు చేయాలనీ, సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను కలిసి వినతి పత్రం అందజేశారు. జనరల్ అప్పీళ్లను రెండ్రోజుల్లో పరిష్కరిస్తామనీ, హోల్డ్‌లో ఉంచిన స్పౌజ్ కేసులపై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకుంటారంటూ సుల్తానియా హామీ ఇచ్చారని తెలిపారు.