Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలి:తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వనమా రాఘవేంద్ర అరాచకాలకు ఆయన తండ్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బాధ్యత వహించాలనీ, ఆయన్ను ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ వనమా కుమారుడు రాఘవేంద్ర చాలా దుర్మార్గమైన వ్యక్తని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ చెప్పిన విషయాల్ని పరిశీలిస్తే రాఘవేంద్ర ఎంత దుర్మార్గుడో అర్థమవుతున్నదన్నారు. ఆయన చాలా ఏండ్లుగా అనేక కుటుంబాలను ఆత్మహత్యలకు ఆయన పురిగొల్పిన అరాచ కవాదని తెలిపారు. చివరకు భార్యను తన వద్దకు పంపిం చాలనేంత నీచమైన పనికి ఒడిగట్టాడన్నారు. ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని చెప్పారు. ఇలాంటి దుర్మార్గుణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తండ్రి వనమా అండతోనే ఇలాంటి అరాచకాలకు అతడు తెగబడ్డా డని తెలిపారు. గతంలో ఇలాంటి కేసులపై ఫిర్యాదులు న్నా..చర్యలు తీసుకోక పోవటానికి ఎమ్మెల్యే పదవిని ఉపయోగించారని చెప్పారు.టీఆర్ఎస్ పార్టీకి ఈ విషయమై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిం చాలనీ, కఠినంగా శిక్షించే విధంగా కేసు నమోదు చేయాలని కోరారు. అరెస్టు విషయంలో గందరగోళాన్ని సృష్టించారనీ, వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.