Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెండా ఊపి ప్రారంభించిన మంత్రి గంగుల
- ఎంబీసీలకు నవయుగం - బుర్రావెంకటేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎంబీసీల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఇ-ఆటో రిక్షా పథకంలో భాగంగా హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ 12 మంది లబ్దిదారులకు ఆటోలను పంపిణీ చేశారు. లబ్దిదారులకు తాళాలు అందించి ఆయన వాటిని జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ ఎంబీసీల జీవనాన్ని, వారి దుస్థితిని పట్టించుకోలేదని గుర్తుచేశారు. కొన్ని కులాలను గుర్తించకపోవటంతో కుల సర్టిఫికేట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమాజంలో సుమారు 60శాతం ఉన్న బీసీల అభివృద్ది కోసం విద్యను అందించాలనే సంకల్పంతో 281 గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. రూ. 500కోట్ల విలువ చేసే పదెకరాల భూమిని ఎంబీసీలకు కేటాయించామన్నారు.