Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యుల ఘనత
హైదరాబాద్ : గుండె సమస్యతో భాదపడుతున్న మయన్మార్ ప్రధాని మిన్ ఆంగ్ మనుమరాలకు రెయిన్బో హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. తొమ్మిది నెలల చిన్నారికి పుట్టుకతోనే గుండెలో సమస్య తలెత్తింది. దీంతో అక్కడి ప్రభుత్వ వర్గాలు రెయినో ఆస్పత్రి సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరావు కోనేటిని సంప్రదించారు. మరో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్వేతా భక్ష్రులు ఇటీవల మయన్మార్ వెళ్లి చిన్నారికి విజయవంతంగా శాస్త్ర చికిత్స చేశారని రెయిన్బో హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలిపింది. ట్రాన్స్ క్యాథెటర్ డివైజ్ క్లోజర్ విధానంలో శస్త్రచికిత్స చేసి గుండెలోని రంధ్రాన్ని సరిచేశారు. ఇదే పర్యటనలో పుట్టుకతోనే హదయ సంబంధ లోపాలతో పుట్టిన మరో 15 మంది శిశువులకు కూడా శస్త్ర చికిత్సలు చేశారు. ప్రధాని మనమరాలు సహా అందరూ కోలుకున్నారని ఆ హాస్పిటల్ వెల్లడించింది.. ప్రధాని మిన్ ఆంగ్ హైంగ్ వైద్య బందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో పేద చిన్నారులకు అవసరమైన శస్త్ర చికిత్సలు. చేద్దామని ప్రధాని కుమారుడు ప్రతిపాదించారని డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.