Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండగా ఉంటానని భరోసా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నల్లగొండ మండలం నర్సింగ్ భట్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి నాగిళ్ల మురళీధర్ గుండెపోటుతో మతి చెందడం పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఈమేరకు మురళీధర్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన కుటుంబానికి వెంటనే న్యాయం చేయడంతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.