Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మూడు రోజులపాటు కొనసాగే సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బివి రాఘవులు, బృందాకర్తోపాటు మిగతా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు ఈ సమావేశా లకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకర్లతో ఏచూరి మాట్లాడుతూ... తమ పార్టీ అఖిల భారత మహాసభలను ఏప్రిల్‌లో కేరళలోని కన్నూర్‌లో నిర్వహించ నున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహి స్తున్న కేంద్ర కమిటీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాపై చర్చిస్తామని చెప్పారు. అనంతరం ప్రజలకు విడుదల చేస్తా మని తెలిపారు. ఆ ముసాయిదాకు సంబంధించిన సూచనలు, సవరణలు, అభిప్రాయాలను తమ పార్టీ సభ్యులందరూ కేంద్ర కమిటీకి తెలపొచ్చని అన్నారు. ఇందుకోసం నెల రోజుల గడువునిస్తామని చెప్పారు. ఇది సీపీఐ (ఎం) అంతర్గత ప్రజాస్వామ్యమని వివరించారు. సవరణల అనంతరం అఖిల భారత మహాసభలో రాజకీయ నివేదికను ప్రవేశపెడతామని తెలిపారు. త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించ బోయే వ్యూహంపై కూడా కేంద్ర కమిటీలో చర్చిస్తామని ఏచూరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... తెలంగాణ మళయాళీ అసోసియేషన్, కేరళ సీఎం విజయన్‌తో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సభ కోవిడ్ నిబంధనల దృష్ట్యా రద్దయిందని తెలిపారు. అయితే ఇక్కడి కేరళవాసుల విజ్ఞప్తి మేరకు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆయన వర్చువల్ (ఆన్లైన్) పద్ధతిలో ప్రసంగించనున్నారని వివరించారు.