Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
మావోయిస్టు జనతన సర్కార్ అధ్యక్షుడు పూనెం మెహగా అలియాస్ బుడ్డాను కోర్సగూడ-అవుట్పల్లి అడవుల్లో పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన మావోయిస్టు అనేక తీవ్రమైన నేరాల్లో పాలుపంచుకున్నాడు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. అరెస్టయిన మావోయిస్టు 2019 సెప్టెంబర్ 12న తార్రెమ్లో నివాసముంటున్న రమేష్ కుంజమ్ను కిడ్నాప్ చేసి, సెప్టెంబర్ 16 తార్రెం అడవుల్లో జన్ అదాలత్ నిర్వహించి హత్య చేసిన ఘటనలో పాల్గొన్నాడు. సిల్గర్ బాసగూడ పోలీస్ స్టేషన్లో అరెస్టయిన మావోయిస్టుపై ఇప్పటికే శాశ్వత వారెంట్ పెండింగ్లో ఉంది. పట్టుబడిన మావోయిస్టుపై చట్టపరమైన చర్యల అనంతరం, బీజాపూర్ కోర్టులో హాజరుపరిచినట్టు బీజాపూర్ ఎస్పీ కమలలోచన్ కశ్యప్ తెలిపారు.