Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల ప్రారంభోత్సవంలో అనీ రాజా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలోని ప్రధాన రాజకీయ శత్రువు బీజేపీని ఓడించేందుకు మహిళ, కార్మిక, రైతు, విద్యార్థి, యువజనులందరూ సమైఖ్య పోరాటాలకు సిద్ధం కావాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్య్లూ) జాతీయ ప్రధాన అనీరాజా పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో వారి పాత్ర మరువలేనిదని చెప్పారు. ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో రెండో రాజైనా శనివారం హైదరాబాద్‌లోని (రోహిత్ వేముల నగర్) విశ్వేశ్వరయ్య భవన్లో ఏఐవైఎఫ్ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సందోష్ కుమార్ జెండానువిష్కరించారు. అంతకుముందు అమరుల స్థూపం వద్ద సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాజ్యసభ సభ్యులు బినొరు విశ్వం తదితరులు నివాళులర్పించారు. అనంతరం అనీరాజా ప్రారంభోపన్యాసం చేస్తూ...ప్రధాని మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని హిందూదేశంగా మార్చేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తూ, ఆత్మనిర్భర్ భారత్ అంటూ మాట్లాడటమేంటని ప్రశ్నించారు. మహిళల వివాహ వయసు పెంచడంతోనే సమానత్వం రాదన్నారు. దీంతో మహిళా విద్యకు అవకాశం ఉంటుందనే మోడీ ప్రభుత్వ వాదన అర్ధరహితమని తెలిపారు.
నిరుద్యోగ సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలి : అభయ్
దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో వామపక్షాలు సంయుక్త పోరాటాన్ని నిర్వ హించాల్సిన అవసరం ఉందని డీవైఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అభరు ముఖర్జీ తన సౌహార్థ సందేశంలో చెప్పారు. వామపక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని కోరారు. ఆ దిశగా ప్రయత్నాలు సాగాలని చెప్పారు. దేశ వ్యాప్తంగా సంక్షోభ సమయంలో వామపక్ష అనుబంధ సంఘాలు ముఖ్యపాత్రను పోషిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్కీ మహేసరి, తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ కూడా ప్రసంగించారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఇ.టి.నర్సింహ స్వాగతోపన్యాసం చేశారు. ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమలై మహాసభల కార్యాకలాపాల నివేదికను విడుదల చేశారు. ఈ సమావేశంలో కేరళ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆఫ్తాబ్ ఆలంఖాన్, రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్ తదితరులు మాట్లాడారు.