Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేశ్‌కుమార్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ శిక్షణ శిబిరాలు వాయిదా పడ్డాయి. కొవిడ్ కారణంగా వాయిదా వేస్తున్నట్టు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. శనివారం గాంధీభవన్‌లో వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే శిక్షణ శిబిరాల కోసం టీపీసీసీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. దేశంలోనూ, రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా పెరిగిపోతున్నదనీ, ఈ క్రమంలోనే కాంగ్రెస్ శిక్షణా శిబిరాలను వాయిదా వేసినట్టు తెలిపారు.