Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహనీయుల ఆశయాల మాలికగా నూతన సంవత్సర (2022) క్యాలెండర్‌ను కేవీపీఎస్ రూపొందించిన కేరళ దేవదాయ శాఖ మంత్రి, దళిత శోషణ్ ముక్తి మంచ్(డీఎస్ఎమ్ఎమ్) జాతీయ అధ్యక్షులు కె రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద శనివారం డీఎస్ఎమ్ఎమ్ జాతీయ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేవీపీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పాటూరి రామయ్య, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ,టి స్కైలాబ్బాబుతో కలిసి క్యాలెండర్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక అంతరాలు కొనసాగుతున్నంత కాలం మహనీయుల ఆశయాలను నేటి తరానికి గుర్తుచేస్తూనే ఉండాలని అన్నారు. ఆ గురుతర బాధ్యతను కేవీపీఎస్ భుజానికెత్తుకోవాలని కోరారు. దేశంలో బీజేపీ విధానాలు దళితుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టే విధంగా ఉన్నాయని చెప్పారు .దళితులపై పెరుగుతున్న దాడులు పరాకాష్టకు చేరాయని చెప్పారు. సామాజిక మార్పుకోసం సమానత్వ సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.