Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ జర్నలిస్టు అమరయ్య అభినందన సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీనియర్ పాత్రికే యులు ఆకుల అమరయ్య పత్రికా రంగంలో విశిష్ట సేవలంది ంచారని పలువురు వక్తలు, జర్నలిస్టులు అన్నారు. పాత్రికేయుడికి ఉద్యోగ విరమణ అనేదే ఉండబోదని వారు చెప్పారు. వయసు పరంగా అమరయ్య ఉద్యోగ విరమణ పొందినా...ఆయన కలం ఆగకుండా ఎల్లప్పుడూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ పాత్రికేయులు ఆకుల అమరయ్య ఆత్మీయ అభినందన సభను శనివారం హైదరాబాద్ లోని హిందీ ప్రచార సభలో నిర్వహించారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పలువురు ఆత్మీయ మిత్రులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సమాచార శాఖ మాజీ డైరెక్టర్ కిస్మత్ కుమార్, సీనియర్ పాత్రికేయులు కిషోర్, రామ్మోహన్ నాయుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య తదితరులు పాల్గొని అమరయ్యకు ఆత్మీయ సత్కారం చేశారు. వీరితోపాటు సీనియర్ జర్నలిస్టులు మన్నె శ్రీనివాసరావు, శ్రీకాంత్, గోపీచంద్, విష్ణు, సతీష్, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. రాంచందర్, కార్యద ర్శి ఎర్రం నర్సింగరావు, హెచ్‌యూజే అధ్యక్షులు ఇ.చంద్రశేఖర్, నాయకులు పాండురంగారావు, విజయానంద్ తదితరులు అభినందనలు తెలిపారు.