Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్య
- క్యాబినెట్ సబ్‌కమిటీలో మంత్రుల ప్రతిపాదనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అనాథలకు తల్లీ, తండ్రీ ప్రభుత్వమేననీ, వారికి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలని క్యాబినెట్ సబ్‌కమిటీ పేర్కొంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని మహిళాభివృద్ధి, శిశు, సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌లో మంత్రులు సమావేశమయ్యారు. స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో మంత్రులు కేటీఆర్, హారీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, ప్రత్యేక ఆహ్వానితులుగా బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కూడిన సబ్‌కమిటీ పలు నిర్ణయాలు చేసింది. రాష్ట్రంలో అనాథలు ఇక ఉండొద్దనే సంకల్పంతో వారిని రాష్ట్ర బిడ్డలుగా పరిగణిస్తూ, కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేసి, ప్రత్యేక గురుకాలాల్లో నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించారు. వారు జీవితంలో స్థిరపడేలా ఉపాధి కల్పించి, కుటుంబం ఏర్పాటు చేసే విధంగా చట్టంలో ప్రత్యేక రక్షణలు కల్పించాలని కమిటీ ప్రతిపాదించింది. అనాథలకు సమగ్ర చట్టం చేసేందుకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో అనాథ ఆశ్రమాలు, స్వచ్చం ద సంస్థల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి,వారిసలహాలు,సూచనలు తీసుకున్నామ ని మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి, కమిటీ కన్వీనర్ దివ్యదేవరాజన్ మంత్రుల కు వివరించారు. ప్రతిపాదనల సమాహారాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కొంత మంది, పిల్లలను అడ్డుపెట్టుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే అభిప్రాయం సమావేశంలో వచ్చింది.చిన్నారులతో ఆయా సిగళ్ల వద్ద బిక్షాటన చేయిస్తున్నారనీ,సంబంధిత వ్యక్తులపై పీడీ చట్టం పెట్టి శిక్షించే విధంగా రానున్న నూతన చట్టంలో నిబంధనలు రూపొందించాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు.అనాథ పిల్లలకు ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు ఇవ్వాలనీ,ఆ కార్డు ఉంటే ఆదాయ, కుల సర్టిఫికేట్కు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.