Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 15 ఏండ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఉన్న విజ్ఞాన్ కాలేజీలో విద్యార్థుల కోసం వ్యాక్సిన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి మూడోదశ విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో నార్సింగి ఇన్స్పెక్టర్ శివకుమార్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ మనోహర్, ఎస్ఐ రమేష్‌రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటేశ్ పాల్గొన్నారు.