Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నీట్, జేఈఈ-2022 ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 'కోటా' స్టడీమెటీరియల్‌ను సిద్ధం చేసినట్టు ఐఐటీ-జేఈఈ, నీట్ ఫోరం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గ్రాండ్ టెస్టులు, పరిష్కారాలు, రాపిడ్ నోట్స్, మాక్ టెస్టులు, వీడియో లెక్చర్లు, ఆన్లైన్ టెస్టు సిరీస్, మాడ్యూల్స్‌ను సిద్ధం చేసినట్టు వివరించింది. ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సహకారంతో నీట్, జేఈఈ డిజిటల్ పీడీఎఫ్ మొబైల్ వెర్షన్ రూపంలో ప్రిపరేషన్, ప్రాక్టీస్ కోసం వాటిని సిద్ధం చేసినట్టు పేర్కొంది. ఆసక్తి గల వారు జేఈఈ 2022 అని టైప్ చేసి 9849016661 వాట్సాప్ నెంబర్‌కు మెసేజ్ చేయాలని సూచించింది.