Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ)తో ఉన్నత విద్యామండలి సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి రూపొందించిన స్టూడెంట్స్ అకడమిక్ రికార్డ్స్ వెరిఫికేషన్ సర్వీస్ వెబ్‌సైట్‌పై చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సమావేశానికి తక్కువ మందిని ఆహ్వానించామని తెలిపారు.