Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం పంతం నెగ్గించుకుందనీ, ఉపాధ్యాయులు, ఉద్యోగులు బలయ్యారని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు విమర్శించారు. జీవోనెంబర్ 317 ఏకపక్షంగా అమలు చేసిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితుల గోడును, సంఘాల సూచనలను పట్టించుకోలేదని వివరించారు. దీంతో రాష్ట్రంలో ఎనిమిది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాల్సిన అవసరమున్నా అధికారులు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయులు, ఉద్యోగుల విజ్ఞప్తులను పరిశీలించడానికి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలని కోరారు. ప్రభుత్వానికి పంతం కావాలో, ఉపాధ్యాయుల ప్రాణాలు కావాలో తేల్చుకోవాలని హెచ్చరించారు.