Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీలన్నీ చూపకపోవడం సరికాదు : విద్యామంత్రికి టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రపతి ఉత్వర్వులు-2018కి అనుగుణంగా ప్రధానోపాధ్యాయుల లోకల్ జిల్లా క్యాడర్ కేటాయింపులు అసంబద్ధంగా జరిగాయని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) విమర్శించింది. పాఠశాలల కేటాయింపుల్లో ఖాళీలన్నీ చూపకపోవడం సరైంది కాదని తెలిపింది. ప్రధానోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని టీఎస్‌జీహెచ్‌ఎంఏ అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం కలిసి వినతిపత్రం సమర్పించారు. సంగారెడ్డి నుంచి 40 మంది ప్రధానోపాధ్యాయులు వారి ఆప్షన్‌కు విరుద్ధంగా మల్టీ జోన్-1కు కేటాయించారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 16 మంది ప్రధానోపాధ్యాయులను మల్టీజోన్-2కు కేటాయించారని పేర్కొన్నారు. ఖాళీలను చూపించకుండా మారుమూల ప్రాంతాలను చూపించారని తెలిపారు. దీనివల్ల మల్టీజోన్ మారి అశాంతిగా ఉన్న ప్రధానోపాధ్యాయులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు మానసికంగా కుంగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయులు కోరుకున్న మొదటి ప్రాధాన్యత మల్టీజోన్కు కేటాయించాలని డిమాండ్ చేశారు.