Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎమ్ఐడీసీ చైర్మెన్‌కు తెలంగాణ నర్సింగ్ సమితి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైద్యారోగ్య శాఖలో కీలకంగా పనిచేస్తున్న నర్సుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ నర్సింగ్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కె.గోవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు టీఎస్ఎమ్ఐడీసీ చైర్మెన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసి ఓ భవనం కట్టించాలని కోరారు. టీఎస్పీఎస్సీలో మిగిలిన 893 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విన్నవించారు. రాష్ట్రంలో వివిధ పథకాలలో పనిచేస్తున్న నర్సులకు 11వ పీఆర్సీ ప్రకారం బేసిక్ వేతనం ఇవ్వాలని కోరారు. కోవిడ్ వంటి ప్రమాదకర పరిస్థితిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నర్సులకు 35 సీఎల్స్, జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సులకు కనీస వేతనం రూ.25 వేలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. నర్సులకు స్టాఫ్ నర్సు హోదా మార్చి నర్సింగ్ ఆఫీసర్ హోదా ఇస్తూ జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త నర్సింగ్ భవనాలను కట్టాలని డిమాండ్ చేశారు.