Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐక్యపోరాటాల ద్వారా ఒత్తిడి పెంచితేనే సింగరేణి యాజమాన్యం దిగివస్తుందనీ, ఆదిశగా పోరాటాలు చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.మధు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వివక్షత విడనాడాలనీ, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జేఏసీ పెట్టిన డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు వేల్పుల కుమారస్వామి, కె.రాజయ్య, గద్దల.శ్రీనివాస్, ఎం.చంద్రశేఖర్, యన్.సూర్య, శ్రీనివాస్, కుమారి, మదనమ్మ, లక్ష్మి, ఉపేందర్, సదానందం, అంజి తదితరులు పాల్గొన్నారు.