Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
- నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ - పెద్దపల్లి
ప్రజల సమస్యలపై నిష్పక్షపాతంగా వార్తలు రాసేది రాష్ట్రంలో నవతెలంగాణ దినపత్రిక మాత్రమేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. వికలాంగులకు ఉపకార వేతనాలు, పరికరాలు అందించేందుకు ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నడానికి మంత్రి విచ్చేసిన సందర్భంగా.. నవతెలంగాణ దినపత్రిక పెద్దపల్లి జిల్లా క్యాలెండర్‌ను స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవతెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రధానంగా ప్రజా సమస్యలపైన వార్తలు రాస్తోందన్నారు. రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలున్నప్పటికీ ప్రజల సమస్యలపైన పోరాటాలు, ఉద్యమాలు చేపట్టే రైతులు, కార్మికులు, ఉద్యోగుల పక్షాన వార్తలు రాయడం గొప్ప విషయమని అభినందించారు. భవిష్యత్తులో పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా, వివాదాస్పద మైన, వ్యక్తిగత అంశాలకు వెళ్లకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా వార్తలు రాసేది నవతెలం గాణ మాత్రమే అని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాహుల్ ఖాన్, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మెన్ శంకర్ నాయక్, వైస్ చైర్మెన్ జడల సురేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మార్క లక్ష్మణ్, వివిధ విభాగాల అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, పత్రిక విలేకరులు, సిబ్బంది పాల్గొన్నారు.